Faith Statement :
We believe in the almighty God who is three persons, the Father, the Son and the Holy Spirit (I Peter 1:2; II Cor. 13:14; Matt 3:16-17). The attributes of God include self-existence, loving, omnipotent, omnipresent and omniscient.
We believe in Jesus Christ as the only Begotten who has lived a sinless life. Who for the redemption of mankind gave His life and rose again on the third day. (Heb 7:26; Jn 1:1-14)
We believe in the Holy Spirit as the third person of the Trinity. His activities are teaching, guiding, comforts, convicts and sanctifies the believers. Matt. 3:16-17; I Peter 1:2
We believe that all the scriptures are revealed and are inspired by the Word of God. Its authors were superintendent by God. All scriptures are given for the instruction of the Church (2: Tim. 3: 15-17; 2 Peter 1:20-21).
We believe that all Human beings are created by God in His own Image. However, all human beings became sinful by nature due to the sin of their first parents.
We believe that salvation is the ultimate redemption from sin and judgment of God and the reconciliation to God. There is salvation only through Jesus Christ (I Thess. 1:6-10).
We believe the Church as the body of Christ composed of the people of God. The church is one, holy, catholic and apostolic. I also believe that the Lord has initiated and ordained the sacrament of baptism and the Lord’s Supper for the
edification of the church. (I Cor 12: 12-14; Eph 4:1-6). We believe in the final bodily resurrection of the saints on the return of the Lord (I Thess. 4:13-18). I also believe that all the unsaved people would be eternally condemned.
We believe that angels and demons exist and both are spirit beings. I believe that their capability is restricted by God. The angels are God’s emissaries accomplishing his purpose in the world. Demons will be judged at the end of the age and will be subjected to eternal punishment.
Apostles’ Creed
I believe in God, the Father almighty,
creator of heaven and earth.
I believe in Jesus Christ, his only Son, our Lord,
who was conceived by the Holy Spirit
and born of the virgin Mary.
He suffered under Pontius Pilate,
was crucified, died, and was buried;
he descended to hell.
The third day he rose again from the dead.
He ascended to heaven
and is seated at the right hand of God the Father almighty.
From there he will come to judge the living and the dead.
I believe in the Holy Spirit,
the holy catholic church,
the communion of saints,
the forgiveness of sins,
the resurrection of the body,
and the life everlasting. Amen.
Nicene Creed
We believe in one God,
the Father almighty,
maker of heaven and earth,
of all things visible and invisible.
And in one Lord Jesus Christ,
the only Son of God,
begotten from the Father before all ages,
God from God,
Light from Light,
true God from true God,
begotten, not made;
of the same essence as the Father.
Through him all things were made.
For us and for our salvation
he came down from heaven;
he became incarnate by the Holy Spirit and the virgin Mary,
and was made human.
He was crucified for us under Pontius Pilate;
He suffered and was buried.
The third day he rose again, according to the Scriptures.
He ascended to heaven
and is seated at the right hand of the Father.
He will come again with glory
to judge the living and the dead.
His kingdom will never end.
And we believe in the Holy Spirit,
the Lord, the giver of life.
He proceeds from the Father and the Son,
and with the Father and the Son is worshiped and glorified.
He spoke through the prophets.
We believe in one holy catholic and apostolic church.
We affirm one baptism for the forgiveness of sins.
We look forward to the resurrection of the dead,
and to life in the world to come. Amen.
Athanasian Creed
Whosoever will be saved , before all things it is necessary that he hold the Catholic Faith. Which Faith except everyone do keep whole and undefiled, without doubt he shall perish everlastingly.
And the Catholic Faith is this: That we worship one God in Trinity, and Trinity in Unity, neither confounding the Persons, nor dividing the Substance. For there is one Person of the Father, another of the Son, and another of the Holy Ghost.
But the Godhead of the Father, of the Son, and of the Holy Ghost, is all one, the Glory equal, the Majesty co-eternal. Such as the Father is, such is the Son, and such is the Holy Ghost.
The Father uncreate, the Son uncreate, and the Holy Ghost uncreate. The Father incomprehensible, the Son incomprehensible, and the Holy Ghost incomprehensible. The Father eternal, the Son eternal, and the Holy Ghost eternal.
And yet they are not three eternals, but one eternal. As also there are not three incomprehensibles, nor three uncreated, but one uncreated, and one incomprehensible.
So likewise the Father is Almighty, the Son Almighty, and the Holy Ghost Almighty. And yet they are not three Almighties, but one Almighty.
So the Father is God, the Son is God, and the Holy Ghost is God. And yet they are not three Gods, but one God. So likewise the Father is Lord, the Son Lord, and the Holy Ghost Lord. And yet not three Lords, but one Lord.
For like as we are compelled by the Christian verity to acknowledge every Person by himself to be both God and Lord, So are we forbidden by the Catholic Religion to say, There be three Gods, or three Lords. The Father is made of none,
neither created, nor begotten. The Son is of the Father alone, not made, nor created, but begotten. The Holy Ghost is of the Father and of the Son, neither made, nor created, nor begotten, but proceeding.
So there is one Father, not three Fathers; one Son, not three Sons; one Holy Ghost, not three Holy Ghosts. And in this Trinity no one is before, or after ; none is greater, or less than another; But the whole three Persons are co-eternal
together and co-equal. So that in all things, as is aforesaid, the Unity in Trinity and the Trinity in Unity is to be worshipped. He therefore that will be saved is must think thus of the Trinity.
Furthermore, it is necessary to everlasting salvation that he also believe rightly the Incarnation of our Lord Jesus Christ. For the right Faith is, that we believe and confess, that our Lord Jesus Christ, the Son of God, is God and Man;
God, of the substance of the Father, begotten before the worlds; and Man of the substance of his Mother, born in the world; Perfect God and perfect Man, of a reasonable soul and human flesh subsisting.
Equal to the Father, as touching his Godhead; and inferior to the Father, as touching his manhood; Who, although he be God and Man, yet he is not two, but one Christ; One, not by conversion of the Godhead into flesh but by taking of the
Manhood into God; One altogether; not by confusion of Substance, but by unity of Person. For as the reasonable soul and flesh is one man, so God and Man is one Christ; Who suffered for our salvation, descended into hell, rose again
the third day from the dead. He ascended into heaven, he sitteth at the right hand of the Father, God Almighty, from whence he will come to judge the quick and the dead. At whose coming all men will rise again with their bodies and
shall give account for their own works. And they that have done good shall go into life everlasting; and they that have done evil into everlasting fire.
This is the Catholic Faith, which except a man believes faithfully, he cannot be saved.
Chalcedonian Creed
“We, then, following the holy Fathers, all with one consent, teach men to confess one and the same Son, our Lord Jesus Christ, the same perfect in Godhead and also perfect in manhood; truly God and truly man, of a reasonable soul and body;
consubstantial with the Father according to the Godhead, and consubstantial with us according to the Manhood; in all things like unto us, without sin; begotten before all ages of the Father according to the Godhead, and in these latter
days, for us and for our salvation, born of the Virgin Mary, the Mother of God, according to the Manhood; one and the same Christ, Son, Lord, only begotten, to be acknowledged in two natures, unconfusedly, unchangeably, indivisibly,
inseparably; the distinction of natures being by no means taken away by the union, but rather the property of each nature being preserved, and concurring in one Person and one Subsistence, not parted or divided into two persons, but
one and the same Son, and only begotten, God the Word, the Lord Jesus Christ; as the prophets from the beginning have declared concerning Him, and the Lord Jesus Christ Himself has taught us, and the Creed of the holy Fathers has handed
down to us.”
Five Solas of Reformation
Sola Scriptura (by Scripture Alone)
Solus Christus (through Christ Alone)
Sola Fide (by Faith Alone)
Sola Gratia (by Grace Alone)
Soli Deo Gloria (Glory to God alone)
బైబిల్ బడి వారి విశ్వాస ప్రమాణం
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్న సర్వశక్తుడైన త్రియేక దేవునియందు విశ్వాసముంచుచున్నాము (1పేతురు1:2; 2కొరింథీ 13:14; మత్తయి 3:16-17). ఆయనే స్వయంభవుడు, ప్రేమామయుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి మరియు సర్వజ్ఞాని అని విశ్వాసముంచుచున్నాము (ద్వితీ
6:4-5; యోహాను 3:16; కీర్తనలు 139:14; యెషయా 57:15; 1 కొరింథీ 8:6; ప్రకటన 3:20, 4:10-11).
పాపరహితమైన జీవితాన్ని జీవించిన అద్వితీయుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుతున్నాము. ఈయన మానవ జాతి విమోచన కొరకు తన ప్రాణమును పెట్టి, మూడవ దినమున మరణం నుండి తిరిగి లేచాడని నమ్ముతున్నాము (హెబ్రీ 4:15; 7:26; యోహాను 1:1-14, 14:6; గలతీ 4:4; రోమా 5:8; 1 పేతురు
2:24; ఫిలిప్పీ 2:6 ).
త్రిత్వంలో మూడవ వ్యక్తిగా పరిశుద్ధాత్మను నమ్ముతున్నాము. విశ్వాసులకు బోధించడం, వారిని నడిపించడం, ఆదరించడం, ఒప్పించడం మరియు పరిశుద్ధపరచడమనేవి ఆయన కార్యాలుగా నమ్ముతున్నాము (మత్తయి.3:16-17; 1 పేతురు 1:2; అపొ. కా 2:38; యోవేలు 2:29; రోమా 8:14; యోహాను
4:24, 14:26; గలతీ 5:22).
లేఖనాలన్నీ దేవుని ప్రత్యక్షతని మరియు ఆయనచే ప్రేరేపించబడినవని నమ్ముతున్నాము. బైబిల్ గ్రంథకర్తలు దేవుని పర్యవేక్షణలో రాశారు. సంఘ క్షేమాభివృద్ధి కొరకై లేఖనాలన్నీ ఇవ్వబడ్డాయి (2 తిమోతి 3:15-17; 2 పేతురు 1:20-21)
మానవులందరు దేవుని స్వరూపమందు దేవునిచే సృష్టించబడ్డారని నమ్ముతున్నాము. అయినప్పటికినీ, మానవులు, వారి ఆది పితరుల పాపం వలన స్వభావసిద్ధముగా పాపులుగా మారారు. (ఆది 1:26-27; రోమా 3:23, 5:12, 6:23; గలతీ 2:20; ప్రసంగి 7:29; 2 కొరింథీ 5:17)
రక్షణ అంటే పాపం నుండి మరియు దేవుని తీర్పు నుండి అంతిమ విమోచన అని, అలాగే పాపంతో దేవునికి దూరమైన మానవుడు తిరిగి క్రీస్తులో దేవునితో సమాధానపరచబడడమని నమ్ముతున్నాము. మానవుల పాపక్షమాపణ కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని విశ్వసిస్తున్నాము
(రోమా 10:9-13; ఎఫెసీ 2:8; 1థెస్సలో 1:6-10; తీతు 3:5)
సంఘం, విశ్వాసులతో కూడిన క్రీస్తు శరీరమని నమ్ముతున్నాము. మరియు సార్వత్రికమును అపొస్తలికమునైన ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాము. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పరిశుద్ధ సంస్కారాలైన బాప్తిస్మం మరియు ప్రభు బల్లను ప్రభువు నియమించాడని నమ్ముతున్నాము
(మత్తయి 16:18, 18:20; 1 పేతురు 2:9; ఎఫెసీ 2:19-20, 4:1-6; 1కొరింథీ 12:12-14; రోమా 12:4-5)
యేసు ప్రభువు రెండవ రాకడలో పరిశుద్ధుల యొక్క అంతిమ శరీర పునరుత్థానాన్ని నమ్ముతున్నాము (1థెస్సలో 4:13-18). రక్షించబడని ప్రజలందరు నిత్య శిక్షను పొందుతారని నమ్ముతున్నాము (ప్రకటన 22:7; యోహాను 11:25).
దేవదూతలు, దురాత్మలు ఉనికి కలిగి ఉన్నారని, వీరు ఆత్మజీవులని కూడా నమ్ముతున్నాము. వారి సామర్ధ్యం దేవునిచే నిరోధించబడుతుందని నమ్ముతున్నాము. దేవదూతలు, లోకంలో దేవుని ఉద్ధేశ్యాలను నెరవేర్చే దేవుని ప్రతినిధులుగాను, దురాత్మలు యుగాంతమందు తీర్పునొంది, నిత్యశిక్షకు
లోనవుతారని విశ్వసిస్తున్నాము. (యూదా 6).
అపొస్తలుల విశ్వాస ప్రమాణము:
“పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రియైన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయైన మరియ గర్భమందు ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు ఆయన బాధను
పొంది సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకము లోనికి దిగెను. మూడవనాడు చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి, పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రియైన దేవుని కుడిచేతి వైపున కూర్చుండియున్నాడు. అక్కడనుండి బ్రతికియుండు వారిని, చనిపోయినవారిని
విమర్శించుటకు ఆయన వచ్చును. పరిశుద్దాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల ఐక్యమత్యమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును నిత్యజీవమును నమ్ముచున్నాను.. ఆమేన్.”
నైసీయా/నికేయ విశ్వాస ప్రమాణము:
“సర్వశక్తి గలిగినట్టియు గోచరాగోచరములను సకలమును సృజించిన తండ్రియగు ఏక దేవునియందు విశ్వాసముంచు చున్నాము.”
“మరియు దేవుని కుమారుడును, తండ్రిచేత పుట్టింపబడిన వాడును, జనితైకుడును, ఆనగా తండ్రితో సమానమైన ఉనికి గల వాడును, దేవుని వలనైన దేవుడును, వెలుగు వలనైన వెలుగును, నిజ దేపుని వలనైన నిజ దేవుడును, చేయబడినవాడు గాక పుట్టింపబడినవాడును, భూమ్యాకాశములందలి సమస్తమును
ఎవనివలన చేయబడెనో ఆ తండ్రితో సమానమైన ఉనికి గల వాడును, మనుష్యులమైన మన నిమిత్తమును మన రక్షణ నిమిత్తమును దిగివచ్చి అవతారమెత్తి నరుడై, శ్రమపడి, మూడన దినమున తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి వెళ్లి, ఆక్కడనుండి జీవించియుండువారికిని చనిపోయినవారికిని తీర్చు
చేయటకు తిరిగి వచ్చు ఏక ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుచున్నాము.”
“పరిశుద్ధాత్మయందును విశ్వాసముంచుచున్నాము.” ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రినుండియు కుమారునినుండియు బయలుదేరువాడును, తండ్రితోను కుమారునితోను కూడ ఆరాధింపబడి, మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికినవాడునైయున్నాడు. మరియు సార్వత్రికమును అపొస్తలికమునైన
ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచనము కొరకైన ఒక్కటే బాప్తీస్మమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానము కొరకును, పరమందలి జీవము కొరకును ఎదురుచూచుచున్నాము. ఆమేన్ !
అతనేషియన్ విశ్వాస ప్రమాణం
త్రిత్వంలోని ఏక దేవుడిని మరియు ఏకత్వంలో త్రిత్వదేవుడిని మనం ఆరాధిస్తున్నాము. వారు వ్యక్తులుగా కలిసిపోలేదు, స్వభావంలో విడిగాను లేరు. ఎందుకంటే వారిలో తండ్రి ఒక వ్యక్తిగాను, కుమారుడు ఒక వ్యక్తిగాను, పరిశుద్ధాత్ముడు మరొక వ్యక్తిగాను ఉన్నారు. కానీ తండ్రి,
కుమార, పరిశుద్ధాత్మల దైవత్వం ఏకమై ఉన్నది, వారి మహిమలు సమానమైనది, వారి మాహాత్మ్యము నిత్యమైనది. తండ్రి ఎలాంటి వాడో, కుమారుడును, పరిశుద్ధాత్ముడు అలాంటి వారు.
తండ్రి, సృష్టించబడనివారు, కుమారుడు సృష్టించబడని వారు మరియు పరిశుద్ధాత్ముడు సృష్టించబడనివారు. తండ్రి అగోచరుడు (గ్రహింపశక్యము కానివాడు), కుమారుడు అగోచరుడు మరియు పరిశుద్ధాత్ముడు అగోచరుడు. తండ్రి నిత్యుడు, కుమారుడు నిత్యుడు మరియు పరిశుద్ధాత్ముడు నిత్యుడు.
అయినప్పటికిని వారు మూడు నిత్యత్వాలు కలిగినవారు కాదు, కానీ ఒకే నిత్యత్వం కలిగిన వారు. అదేవిధంగా ముగ్గురు అగోచరులు కాదు, ముగ్గురు సృజించబడని వారు కాదు, కానీ ఒక్కడే సృజించబడని అగోచరుడు.
అదేవిధంగా, తండ్రి సర్వశక్తిమంతుడు, కుమారుడు సర్వశక్తిమంతుడు మరియు పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడు. అయినప్పటికిని వారు ముగ్గురు సర్వశక్తిమంతులు కాదు, కానీ ఒక్కడే సర్వశక్తిమంతుడు.
అదేవిధంగా, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు మరియు పరిశుద్ధాత్ముడు దేవుడు. అయినప్పటికిని ముగ్గురు దేవుళ్ళు కాదు, కానీ ఒక్కడే దేవుడు. అదే విధంగా, తండ్రి ప్రభువు, కుమారుడు ప్రభువు మరియు పరిశుద్ధాత్ముడు ప్రభువు. కానీ ముగ్గురు ప్రభువులు కాదు, ఒక్కడే ప్రభువు.
ప్రతివ్యక్తిని దేవునిగాను, వ్యక్తిగాను ఒప్పుకోవడానికి క్రైస్తవ ప్రామాణికతచే బలవంతపెట్టబడుతున్నట్లుగానే, ముగ్గురు దేవుళ్ళు లేదా ముగ్గురు ప్రభువులు ఉన్నారని చెప్పడాన్ని క్యాథలిక్ సంఘం నిషేధిస్తుంది. తండ్రిని ఎవరు సృష్టించలేదు, కనలేదు. కుమారుడు, తండ్రి
నుండి వచ్చినవాడే కానీ ఎవరు ఆయన్ని తయారుచేయలేదు, సృష్టించలేదు, కనలేదు, కానీ తండ్రి నుండి వచ్చాడు.
కాబట్టి ఒక్కడే తండ్రి ఉన్నాడు కానీ ముగ్గురు తండ్రులు లేరు; ఒక్కడే కుమారుడున్నాడు కానీ ముగ్గురు కుమారులు కాదు; ఒక్కడే పరిశుద్ధాత్ముడు, కానీ ముగ్గురు పరిశుద్ధాత్ములు కాదు. ఈ త్రిత్వంలో ఎవరు ముందు కాదు లేదా తరువాత కాదు; ఎవరు గొప్పవారు లేదా ఒకరు మరొకరి
కంటే తక్కువవారు కాదు; కానీ త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు నిత్యులు మరియు సమానులు. కాబట్టి, ముందు చెప్పబడినట్లుగా, అన్నీ విషయాలలో త్రిత్వంలో ఏకమైయున్న, ఏకత్వంలో త్రిత్వమైయున్న దేవునిని ఆరాధించాలి. కాబట్టి రక్షించబడిన వ్యక్తి త్రిత్వమును గూర్చి
ఆలోచించాలి.
అంతేకాకుండా, ఒక విశ్వాసి తన రక్షణను నిత్యము కొనసాగించాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరాధరణమును కూడా సరైన విధంగా నమ్మాలి. ఎందుకంటే మనం నమ్మే, ఒప్పుకునే సరైన విశ్వాసం ఏమిటంటే దేవుని కుమారుడును, మన ప్రభువునునైన యేసుక్రీస్తు, సంపూర్ణ దేవుడు మరియు
సంపూర్ణ మానవుడు. తన తండ్రి స్వభావాన్ని బట్టి దేవుడు, జగత్తు పునాదికి ముందే జన్మించినవాడు; మరియు తన తల్లి యొక్క స్వభావాన్ని బట్టి మానవుడు, లోకంలో జన్మించినవాడు; హేతుబద్ధమైన మనసును, మానవ శరీరాన్ని కలిగిన పరిపూర్ణ దేవుడు మరియు పరిపూర్ణమానవుడు.
తన దైవత్వం విషయంలో తండ్రితో సమానుడు; తన మానవత్వం విషయంలో తండ్రికంటే తక్కువవాడు; ఆయన దేవుడు, మానవుడు అయినప్పటికిని ఇద్దరు కాదు, కానీ ఒక్కడే క్రీస్తు; దైవత్వం నుండి మానవత్వానికి మారిన వ్యక్తి కాదు, కానీ మానవత్వాన్ని దేవునిలోని తీసుకెళ్లిన వ్యక్తి; స్వభావంలో
గందరగోళం ద్వారా కాదు కానీ వ్యక్తిత్వం యొక్క ఐక్యత ద్వారా కలిగిన వాడు. ఆలోచించే మనసు, శరీరం ఒక మనిషికి ఉన్నట్లుగానే, దైవత్వం మరియు మానవత్వం ఒక్క క్రీస్తులోనే ఉన్నాయి; ఈయన మన రక్షణకై చనిపోయి, పాతాళం లోనికి దిగిపోయి, మూడవ దినాన మరణంలో నుండి తిరిగి
లేచాడు. ఆయన పరలోకమునకు ఆరోహణుడై, సర్వశక్తి మంతుడైన దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. సజీవులకును, మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి రాబోతున్నాడు. అతని రాకడ సమయంలో సమస్త జనులు తమ శరీరాలతో సహ లేచి, తమ క్రియలను బట్టి దేవునికి లెక్కఅప్పగిస్తారు.
వారిలో మంచి చేసిన వారు నిత్యజీవానికి వెళతారు; చెడు చేసిన వారు నిత్యాగ్ని దండనకు వెళతారు.
ఇది సార్వత్రిక సంఘ విశ్వాసం. దీనియందు నమ్మకంగా విశ్వాసముంచని వారు, రక్షణ పొందలేరు.
చాల్సిడన్ విశ్వాస ప్రమాణం
“ఇప్పుడు మనమందరం పరిశుద్ధులైన సంఘ పితరులను అనుసరించి, మన ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించాలని మనుష్యులకు బోధించాలి. ఆయనను గూర్చి ఆదినుండి ప్రవక్తలు చెప్పినట్లుగాను, ప్రభువైన యేసుక్రీస్తు తనను గూర్చి తాను మనకు బోధించినట్లుగాను మరియు పరిశుద్ధులైన
సంఘపితరులు మనకు అందించిన విశ్వాస ప్రమాణాల ఆధారంగాను, ఈయన దైవత్వంలోను మరియు మానవత్వంలోనూ అదే పరిపూర్ణత కలిగినవాడు; హేతుబద్దమైన మనసు మరియు శరీరం కలిగిన నిజమైన దేవుడును, నిజమైన మానవుడునై ఉన్నాడు; దైవత్వమును బట్టి తండ్రితో సమానుడు మరియు మానవత్వమును
బట్టి మనతో సమానుడు; సమస్త విషయాలలో మనవంటి వాడైనప్పటికిని, పాపంలేనివాడు; దైవత్వమును బట్టి, సకల యుగముల కంటే ముందే తండ్రికి అద్వితీయకుమారుడునైయున్నాడు; మానవత్వమును బట్టి, ఈ అంత్యదినములలో మన కొరకు మరియు మన రక్షణ కొరకు, దేవుని తల్లియైన కన్యమరియకు జన్మించాడు;
ఈయనే క్రీస్తు, కుమారుడు, ప్రభువు, జనితైకుడు, గందరగోళం లేని, మార్పు చెందని, విభజించబడని, వేరుచేయలేని రెండు స్వభావాలు కలిగిన వాడిగా అంగీకరించబడినవాడు; ఈ రెండు స్వభావాల యొక్క భినత్వం, వాటి ఐక్యతద్వారా తీసివేయబడలేదు, కానీ ప్రతి స్వభావం యొక్క గుణం
సంరక్షించబడి, ఒక వ్యక్తిలో మరియు ఒక జీవంలో ఇద్దరు వ్యక్తులుగా విభజించబడకుండాను మరియు వేరుచేయబడకుండా ఏకీభవించి ఉన్నాయి, కానీ ఈయన ఒక్కడే అదే కుమారుడు, జనితైకుడు, వాక్యమైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు;
సంఘ సంస్కర్తలు ప్రతిపాదించిన ఐదు పునాది సత్యాలు (5 Solas of Reformation):
1. వాక్యం మాత్రమే (Sola Scriptura: by Scripture Alone)
2. క్రీస్తులో మాత్రమే (Solus Christus: through Christ Alone)
3. విశ్వాసము ద్వారా మాత్రమే (Sola Fide: by Faith Alone)
4. కృప ద్వారా మాత్రమే (Sola Gratia: by Grace Alone)
5. దేవునికి మాత్రమే మహిమ (Soli Deo Gloria: Glory to God Alone)